భారత్ న్యూస్ ఢిల్లీ…..4,500 మంది పాక్ సైనికుల రాజీనామా..!
పాకిస్థాన్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. 4,500 పాక్ సైనికులు, 250 మంది ఆర్మీ అధికారులు ఉద్యోగాలకు, పదవులకు రాజీనామా చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై ఉన్న అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో ఆయన సరిగ్గా వ్యవహరించలేదని పాక్ సైనికుల్లో అసంతృప్తి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
