దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు

చట్టబద్ధంగా ఎలాంటి గుర్తింపు లేకుండా అడ్మిషన్లు జరుపుతున్న నకిలీ ఇంజనీరింగ్‌ కాలేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మరోసారి హెచ్చరించింది.

ఇటీవల ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ గుర్తింపులేని కోర్సులు నిర్వహిస్తుండటం పట్ల యూజీసీ హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర చట్టాల ప్రకారం ఈ కాలేజీ నమోదు కాలేదని, ఇది జారీ చేసే డిగ్రీలు, ఇతర కోర్సులకు ఎలాంటి గుర్తింపు లేదని ఈ నియంత్రణ సంస్థ హెచ్చరించింది.

యూజీసీ డాటా ప్రకారం దేశ వ్యాప్తంగా 22 గుర్తింపు లేని విద్యా సంస్థలు యూనివర్సిటీలుగా నడుస్తున్నాయని తెలిపింది.