చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!

🇮🇷పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది.

🇷🇺ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడ ముడి చమురు నిల్వలు మాత్రమే భారత్‌ వద్ద ఉన్నాయి. అదేవిధంగా గ్యాసాయిల్‌, గ్యాసోలిన్‌, ఎల్‌పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హొర్ముజ్‌ ద్వారా జరుగుతున్నది.

🛳️ఈ జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్‌ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా-ఇజ్రాయెల్‌ ఉమ్మడి దాడుల దరిమిలా ఇరాన్‌ ప్రతిదాడులకు పాల్పడడంతో హొర్ముజ్‌ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్టుసమాచారం.