భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏంటీ బోర్డ్ ఆఫ్ పీస్?.. ఇక యూఎన్ పని అయిపోయినట్లేనా?
🇨🇭 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో బోర్డ్ ఆఫ్ పీస్(Board of Peace) ఏర్పాటుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై గత ఏడాది ఆలోచన పుట్టింది.

వాస్తవానికి గత సెప్టెంబర్‌లో గాజా యుద్ధం కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఆయన క్రియేట్ చేశారు. అయితే ఆ ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికకు యూఎన్ అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. గాజా నుంచి మిలిటరీని వెనక్కి పంపేందుకు, ఆ పట్టణాన్ని మళ్లీ పునర్ నిర్మించేందుకు బోర్డ్ ఆఫ్ పీస్ అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేశారు