భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…మంగళగిరి ఎయిమ్స్‌లో అత్యాధునిక యూనిట్స్ ప్రారంభం
మంగళగిరి:
మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యాధునిక ఎన్ఐసీయూ, పీఐసీయూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది.
ఐపీడీ బ్లాక్‌లోని 3వ అంతస్తులో కొత్తగా స్థాపించిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU), నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) కాంప్లెక్స్ ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ ప్రారంభించారు.
డీన్ అకాడెమిక్స్, మెడికల్ సూపరింటెండెంట్, జాయింట్ మెడికల్ సూపరింటెండెంట్, ఫ్యాకల్టీ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పీడియాట్రిక్స్ బృందానికి ప్రొఫెసర్ అహంతెం శుభాకాంక్షలు తెలిపారు. ఈ అత్యాధునిక PICU-NICU కాంప్లెక్స్, అధునాతన లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌లు, ఆధునిక పర్యవేక్షణ సాంకేతికతలతో అమర్చారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు, పిల్లలకు సమగ్రమైన, 24 గంటల ఇంటెన్సివ్ కేర్‌ను అందిస్తుంది. పిల్లల ఆరోగ్యానికి సంబంధించి అధిక-నాణ్యత, ప్రత్యేక సంరక్షణను అందించడంలో దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.
