భారత్ న్యూస్ గుంటూరు,ఉమ్మడి గుంటూరులో స్క్రబ్ టైఫస్
గుంటూరు జిల్లా వెనిగండ్ల, నరసరావుపేట మండలం ములకలూరులలో స్క్రబ్ టైఫస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అనారోగ్యంతో జీజీహెచ్ లో చేరిన ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
