ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ‘డాక్టర్’ కొలువులకు నోటిఫికేషన్

భారత్ న్యూస్ మంగళగిరి Ammiraju Udaya Shankar.sharma News Editor…….ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ‘డాక్టర్’ కొలువులకు నోటిఫికేషన్

ఏపీ వైద్యారోగ్య శాఖలో 185 డాక్టర్ పోస్టుల నియామకం

ఒప్పంద ప్రాతిపదికన చేపట్టనున్న నియామకాలు

మొత్తం పోస్టుల్లో 155 ఎంబీబీఎస్, 30 స్పెషలిస్టు వైద్యుల ఖాళీలు

పట్టణ ఆరోగ్య, ఆయుష్మాన్ కేంద్రాల్లో వైద్యుల నియామకం

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 185 వైద్యుల పోస్టుల భర్తీకి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్‌ కేంద్రాల్లో సేవలు అందించేందుకు ఈ నియామకాలను ఒప్పంద పద్ధతిలో చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 185 పోస్టులలో 155 పోస్టులను ఎంబీబీఎస్ అర్హత కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మిగిలిన 30 పోస్టులను స్పెషలిస్టు వైద్యుల కోసం కేటాయించారు. ఈ స్పెషలిస్టు ఖాళీలలో 14 చిన్న పిల్లల వైద్యుల (పీడియాట్రిషియన్) పోస్టులు, 3 గైనకాలజిస్టు పోస్టులు, 13 టెలిమెడిసిన్‌ హబ్ పోస్టులు ఉన