రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది?

భారత్ న్యూస్ విశాఖపట్నం..రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది?

పురుషులు రోజుకు 3 లీటర్లు, మహిళలు 2.5 లీటర్ల నీళ్లు తాగాలని ICMR రీసెర్చ్ పేర్కొంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అదనంగా 0.5 నుంచి 1 లీటర్ వరకు తాగొచ్చని తెలిపింది. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుందని, రక్తంలో సోడియం సాంద్రత ఎక్కువవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక డయాబెటిస్, బీపీ, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.