ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్!!

భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్!!

ఏపీలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు, జననాల కంటే మరణాల సంఖ్య పెరుగతున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)- 2022 నివేదికలో వెల్లడైంది. 2015లో 8.51 లక్షల జననాలు నమోదు అవ్వగా అది 2022కి వచ్చేసరికి 7.52 లక్షలకి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ఏంటని విశ్లేషించగా ఖర్చులకు తగ్గ ఆదాయం లేకపోవడం, వలసలు, ఆలస్యపు వివాహాలు, కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని పిల్లలను కనడానికి దంపతులు వెనుకంజ వేయటమే దీనికి ప్రధాన కారణం మేధావులు అంటున్నారు.

జనన మరణాల తేడా

2015లో 8.51లక్షల జననాలు నమోదుకాగా 2022కు అవి
7.52 లక్షలకు పడిపోయాయి. మరోవైపు 2018లో 3.75 లక్షల మరణాలు సంభవించగా 2022కు అవి 4.30 లక్షలకు పెరిగాయి.
కరోనా చావులే దీనికి కారణమని అంటున్నారు.