ట్రాన్స్ పోర్ట్ అలవెన్సు

భారత్ న్యూస్ రాజమండ్రి….ట్రాన్స్ పోర్ట్ అలవెన్సు

స్టేట్ నుండి అందిన సూచనల మేరకు
రెగ్యులర్ విద్యార్థులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ అర్హతను STATE ఉత్తర్వుల ప్రకారం సిఆర్ఎంటీ లాగిన్ ద్వారా అప్డేట్ చేయవలసి ఉంది.

కావున ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు
మీ పాఠశాలలో ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్‌ కు అర్హులైన విద్యార్థుల వివరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించి, సిఆర్ఎంటీ లాగిన్ ద్వారా అప్‌డేట్ చేయించాలి.

రవాణా భత్యం (Transport Allowance) అర్హత ప్రమాణాలు:

📍 i) ప్రాథమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలు:
➡️ హాబిటేషన్ (ఆవాస ప్రాంతం)లో పాఠశాల సౌకర్యం లేనివారు మాత్రమే అర్హులు.

📍 ii) ప్రాథమిక పాఠశాలలకు:
➡️ విద్యార్థి నివాస ప్రదేశం నుండి 1 కి.మీ లోపల పాఠశాల లేకపోతే అర్హత కలదు.

📍 iii) ప్రాధమికోన్నత పాఠశాలలకు:
➡️ 3 కి.మీ దూరంలో పాఠశాల లేనివారికి మాత్రమే అర్హత ఉంటుంది.

📍 iv) మాధ్యమిక పాఠశాలలకు:
➡️ నివాస ప్రాంతం నుండి 5 కి.మీ పరిధిలో మాధ్యమిక పాఠశాల లేకపోతే అర్హత కలదు.

📍v) ఇతర అర్హతలు:

విద్యార్థి బస్సు/మినీబస్సు/ఆటో/సైకిల్ మొదలైన ప్రజా రవాణా ద్వారా పాఠశాలకు వెళ్లాలి.

విద్యార్థి సర్కార్ పాఠశాల లేదా స్థానిక సంస్థ నిర్వహించే పాఠశాలలోనే చదివి ఉండాలి.

ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా భత్యం అందదు.

📍ఆర్థిక ప్రమాణాలు (Financial Norms):

ప్రతి విద్యార్థికి నెలకు: ₹600
విద్యా సంవత్సర కాలవ్యవధి: 10 నెలలు
వార్షికంగా ఒక విద్యార్థికి: ₹6,000

ఈ సమాచారం ప్రకారం చర్యలు తీసుకొని వెంటనే అప్డేట్ చేయగలరు.