వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో బాలికపై ఉపాధ్యాయుడి అత్యాచారం

భారత్ న్యూస్ వరంగల్….. …..వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో బాలికపై ఉపాధ్యాయుడి అత్యాచారం

ప్రశ్నించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు

వనపర్తి జిల్లా కేంద్రంలోని అక్షర స్కూల్లో ఓ మైనారిటీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కీచక టీచర్

బాధితురాలికి న్యాయం చేయాలని అడిగేందుకు పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు

అక్రమ అరెస్టు చేసిన బాధితులను పోలీస్ స్టేషన్లో పరామర్శించి, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సిపిఎం,సీపీఐ నాయకులు

అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడిని, పాఠశాల యాజమాన్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వెంటనే ప్రభుత్వపరంగా బాధితురాలికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక…