ఏపీలో సోమవారం నుండి ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో సోమవారం నుండి ఒంటిపూట బడులు.. ఉ.7.45 గంటలకే స్కూల్

ఏపీలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు జీవో జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పేర్కొన్నారు.