భారత్ న్యూస్ మంగళగిరి Ammiraju Udaya Shankar.sharma News Editor……పదో తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసుకునే అవకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం
అమరావతి :
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను తెలుగు మాధ్యమంలో రాసుకునే వీలుంటుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం కొనసాగించాలని మంత్రిని కోరగా, కొన్ని పాఠశాలల్లోనైనా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
