భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ మెగా డీఎస్సీ… జులై 1, 2 తేదీల్లో పరీక్ష రాసేవారికి అప్ డేట్
జూన్ 20,21 తేదీలలో నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ పరీక్ష
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వాయిదా పడిన వైనం
జులై 1,2 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్ధులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్న అధికారులు
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. జులై 1, 2 తేదీలలో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుండి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కారణంగా జూన్ 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన మెగా డీఎస్సీ పరీక్షలను అధికారులు వాయిదా వేసిన విషయం విదితమే. వాయిదా పడిన పరీక్షలను జులై 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు.

జులై 1, 2 తేదీల్లో జరిగే పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చినందున, నూతన హాల్ టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లలో పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీలను నిర్ధారించుకుని పరీక్షకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, ఆదివారం జరిగిన ప్రిన్సిపల్ పరీక్షకు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పర