.భారత్ న్యూస్ హైదరాబాద్…. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం…

బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ఫేజ్-1 ఆన్లైన్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి. బీటెక్ సీట్ల ప్రవేశానికి పేపర్-1 పరీక్ష ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో.. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష ఈ నెల 28, 29 తేదీల్లో కొనసాగుతాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి….