భారత్ న్యూస్ గుంటూరు ….ఏపీలో ఉచిత విద్య (RTE 12(1)(C)) రెండో విడత ఫలితాలు విడుదల
💬 ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య సీట్లకు సంబంధించిన రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి.
☛ ఈ పథకం కింద ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), వెనుకబడిన వర్గాల విద్యార్థులకు కేటాయిస్తారు.
☛ మొదటి విడతలో ఎంపిక కాని విద్యార్థులకు ఈసారి అవకాశం లభించింది. ఎంపికైన వారు 31.08.2025 లోపు తమకు కేటాయించబడిన పాఠశాలకు వెళ్లి సీటు నిర్ధారణ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే సీటు రద్దు అవుతుంది.
☛ పథకం ముఖ్యాంశాలు:
➥6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు.
➥ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ ఖర్చుతో చదివే అవకాశం.
➥ రెండో విడత ఫలితాల ద్వారా కూడా వేలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్య లభించనుంది.
