జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

భారత్ న్యూస్ రాజమండ్రి….జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

సోమవారం రాత్రి నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై జిల్లాలోని ఎంఈఓ లు, ప్రధానోపాధ్యాయులు రిసోర్స్ పర్సన్ లతో సమావేశం నిర్వహించి క్లస్టర్ల వారీగా సుదీర్ఘంగా లోతుగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 వ తరగతిలో 141 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం సరికాదన్నారు.

అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు పైగా ఉండాల్సినప్పటికీ కేవలం 30 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.
ఒకటవ తరగతి నుండి రెండో తరగతికి విద్యార్థులు మారుతున్నప్పుడు కింది తరగతిలో ఉన్నంత మంది విద్యార్థులు పై తరగతులకు ఎందుకు రాలేదు కారణాలు విశ్లేషించాలని సూచించారు.

ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలన్నారు.

జూన్ మాసం అయిపోయిందిలే ఇక ప్రవేశాలు ఇంతటితో వదిలివేస్తారని అనుకుంటున్నారేమో అలా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇకనైనా