.భారత్ న్యూస్ అమరావతి..6 నుంచి డీఈఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్
అమరావతి: డీఈఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 6 నుంచి ప్రారంభించనున్నారు.
మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్‌ను 6, 7 తేదీల్లో సిద్ధం చేస్తారు.

కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఐచ్చికాలకు 8 నుంచి 12 వరకు అవకాశం కల్పిం చారు.
సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్ల జారీ 13 నుంచి 16 వరకు కొనసాగనుంది.
డైట్లలో సర్టిఫికెట్ల పరిశీలన 17 నుంచి 22 వరకు నిర్వహిస్తారు.
25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.