భారత్ న్యూస్ రాజమండ్రి…CA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్
CA ఇంటర్ పరీక్షలను ఐసీఏఐ (ICAI) రీషెడ్యూల్ చేసింది. దేశవ్యాప్తంగా మే 3న ప్రారంభం కావాల్సిన పరీక్షలు.. మే 5 నుంచి జరగనున్నాయి. గ్రూప్-1 పరీక్షలు మే 5, 7, 9 తేదీల్లో, గ్రూప్-2 పరీక్షలు మే 11, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ఫౌండేషన్, ఫైనల్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని సంస్థ స్పష్టం చేసింది. ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు (మే, నవంబర్)
జరుగుతాయని తెలిపింది.
