చౌటపల్లిలో బడి బాట

భారత్ న్యూస్ వరంగల్….. …..చౌటపల్లిలో బడి బాట

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఊరి బడిని కాపాడుకుందాం అనే నినాదంతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ. టీ.ఎఫ్ )శనివారం సాయంత్రం తిరువూరు మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో బడి బాట కార్యక్రమం చేపట్టారు.

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని, ప్రభుత్వ పాఠశాల ల్లో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లి దండ్రులను కోరారు. యూ. టీ. ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.ముత్తయ్య, నాయకులు రవీంద్ర, రాం ప్రదీప్, పాఠశాల ఉపాధ్యాయిని శిరీష తదితరులు పాల్గొన్నారు….