టెట్‌కు 65% మంది మహిళా అభ్యర్థుల దరఖాస్తులు

భారత్ న్యూస్ గుంటూరు…టెట్‌కు 65% మంది మహిళా అభ్యర్థుల దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ : టెట్‌కు అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్‌ దరఖాస్తుకు ఆదివారం చివరి గడువు కాగా.. సాయంత్రం వరకు 2,58,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా, పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 65% మంది మహిళలే ఉన్నారు. ఎస్జీటీకి నిర్వహించే పేపర్‌-1ఏ కు 1,01,882, స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్‌-2ఏ కు 1,51,220 దరఖాస్తులు వచ్చాయి.