భారత్ న్యూస్ గుంటూరు.నేటితో ముగియనున్న ఏపీ పాలిసెట్ గడువు
ఏపీ పాలిసెట్ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షకు ఇప్పటివరకు అప్లై చేయని విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ ఉత్తీర్ణులు లేదా ఇటీవల పరీక్ష రాసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరగనుంది. ఆలస్యం చేయకుండా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apsbtet.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు….
