ఏపీ పీసెట్ పరీక్షలు

భారత్ న్యూస్ రాజమండ్రి…. నుంచి ఏపీ పీసెట్ పరీక్షలు

అమరావతి :

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సోమవారం నుంచి ఏపీ పీసెట్ నిర్వహించనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్ఎూ) లో పరీక్షలు ఉంటాయని సెట్ కన్వీనర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ తెలిపారు. పురుషులకు ఈ నెల 23-25 వరకు, మహిళలకు 26న పరీక్ష జరుగుతుందని ఆయన వివరించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని
తెలిపారు….