మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కోటప్పకొండ వంటి క్షేత్రాలకు లక్షలాది మంది తరలివచ్చారు. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామప్ప ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలతో శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.