భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి : సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరం అని చెప్పడాన్ని ఏమనాలి..?.. దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా..?
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారు..?.. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చినా దానిని కూడా సమర్ధిస్తారా..?
కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా..?.. ఇలాంటి వాటిన సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోంది.
సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి ఆయన భార్యతోనే మాపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టించారు.
హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే.. ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశాం.

రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తుల పై కఠినంగా వ్యవహరిస్తాం : సీఎం చంద్రబాబు