నేడు.. అన్నవరం సత్యదేవుని పెళ్లి..!

అన్నవరం..

భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. అన్ని దివ్యక్షేత్రాలలానే అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి వారు వెలసిన కొండను తాకుతూ పంపానది ప్రవహిస్తోంది. ఇది సత్యదేవస్వామి నిజాయితీకి ప్రతీకగా నిలుస్తోంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా విష్ణు భక్తులు, శివ భక్తులు, వేలాదిమంది ఇతర యాత్రికులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తులందరు సంపద, విద్య, శ్రేయస్సు, ఆరోగ్యం, వ్యాపారంలో విజయం సాధించడం కోసం శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తారు.

  • ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లున్నాయి. ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అక్కడివారు చెబుతారు.
  • అన్నవరం ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. స్వచ్చమైన నెయ్యి, ఎర్ర గోధుమలతో తయారుచేసే ఈ ప్రసాదాన్ని ఒక్కసారి తిన్నవారు.. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు.

ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు మొదలుకొని.. శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

  • స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.
  • ఇతిహాసాల ప్రకారం చూసుకుంటే, అడిగిన(అనిన), (వరం) వరాలను తీర్చే దేవుడు కాబట్టి అనిన, వరం.. కలిపి అన్నవరం కావడంతో “అన్నవరం దేవుడు”గా ఆయన్ను పిలుస్తారు.