…భారత్ న్యూస్ హైదరాబాద్….తనగల మారెమ్మ అమ్మవారి దేవాలయంలో వర్షం కోసం మూడు రోజులపాటు అఖండ భజన
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి దేవాలయంలో వర్షం కోసం తనగల గ్రామ రైతులు మారెమ్మ, వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి మూడు రోజులపాటు అఖండ భజనతో వర్షం కురవాలని వేడుకుంటున్నారు.

నేడు మంగళవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం గంటలకు అఖండ భజన ప్రారంభం చేశారు. మూడోవ రోజు ఉదయం 6 గంటలకు భజన మహా మంగళారతితో ముగింపు ఉంటుందని తనగల రైతులు తెలిపారు..