భారత్ న్యూస్ విశాఖపట్నం..టీటీడీకి రూ.2.50 కోట్ల భారీ విరాళం
AP: హైదరాబాద్కు చెందిన పి.ఎల్. రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు శుక్రవారం రూ.2.50 కోట్ల విరాళం అందించింది. ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి రాజగోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి డీడీలను అందజేశారు….
