శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

నాగాయలంక: నాగాయలంక పవిత్ర కృష్ణానదీ తీరాన నూతనంగా పునర్నిర్మించిన శ్రీ భూ నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, కనులపండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మరియు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగ వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ దర్శనానంతరం, ఆలయ అనువంశిక ధర్మకర్త గడిపాటి నాగేశ్వరరావు కనపర్తి శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వరరావులను శాలువాతో ఘనంగా సత్కరించారు. భక్తిపూర్వక జ్ఞాపికగా స్వామివారి ప్రతిమను ఆయనకు అందజేశారు.అనంతరం కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాగాయలంక గ్రామంలో ఇంతటి ఘనమైన ఆలయాన్ని పునర్నిర్మించడం అభినందనీయమని,స్వామివారి కృపతో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు పార్టీ నాయకులు సజ్జా గోపాల కృష్ణ,యార్లగడ్డ శ్రీనివాసరావు,ఉప్పల ప్రసాద్,తాడేపల్లి పాపారావు,సనక సురేష్,ఈవూరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు