..భారత్ న్యూస్ హైదరాబాద్…..వీడియో కాల్ సాయంతో ఆపరేషన్..మహిళ మృతి
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత రాజవ్వ (42) అనే మహిళకు గర్భసంచిలో రాళ్ళు రావడంతో జగిత్యాలలోని పల్లవి అనే ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబసభ్యులు
ఆపరేషన్ చేసే క్రమంలో రాజవ్వ గుండెపోటుతో మృతి చెందిందని కుటుంబసభ్యులకు తెలిపిన వైద్యులు
హైదరాబాద్ లోని వైద్యులతో ఫోన్ లో వీడియో కాల్ చేస్తూ ఆపరేషన్ చేయడం వల్లనే రాజవ్వ మృతి చెందిందని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు…