భారత్ న్యూస్ డిజిటల్:రాజమండ్రి:
కోడిపందాలు, పేకాట శిబిరాలపై వరుస దాడులు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.
జిల్లా అంతటా ప్రత్యేక పోలీసు బృందాలచే కోడిపందాలు, గుండాట, జూదము మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు.
…తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.,గారు.
ఈరోజు సీతానగరం, కొవ్వూరు రూరల్, నల్లజర్ల పోలీస్ స్టేషన్ ల పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి, 23 మంది వ్యక్తుల ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 26,500/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
నిన్న 200 కోడి కత్తులను మరియు కత్తుల తయారీకి ఉపయోగించే రెండు మోటర్ మిషన్లు స్వాధీనం చేసుకుని, తయారు చేయు వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసినదే.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు నివారించుటకు గాను ఈ దాడులు చేసినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజలు సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసువారికి సమాచారం అందించాలని సూచించారు.