భారత్ న్యూస్ డిజిటల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ కార్యాలయం
జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం 4589 కేసుల పరిష్కారం: ఎస్పీ రోహిత్ రాజు
జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన క్యాలెండర్ కేసులు-383,డ్రంక్ అండ్ డ్రైవ్-3098,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు,ఈ-పెట్టి కేసులు-1117 తదితర కేసులు మొత్తం 4589 కేసులు పరిష్కృతం కాబడినయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు,కోర్టు సిబ్బంది గత వారం రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీమార్గం రాజ మార్గమని,లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని మరియు ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున ఈ కేసులు పరిష్కరించబడినాయని తెలిపారు.కేసుల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులను,సిబ్బందిని ఎస్పీ ఈ సందర్బంగా అభినందించారు.లోక్ అదాలత్ ద్వారా ఇట్టి కేసుల పరిష్కారానికి ప్రతిభ చూపిన అధికారులు మరియు కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు తగిన రివార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో నమోదైన 71 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి, ఇట్టి కేసులలో నగదును కోల్పోయిన బాధితులకు 15,86,229/- రూపాయల నగదును కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు.
