కొత్వాల్ హౌజ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:కొత్వాల్ హౌజ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

నగరంలోని చారిత్రక ‘కొత్వాల్‌ హౌజ్‌’ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కాగా, ఈ కార్యక్రమానికి  చారిత్రక ప్రాధాన్యం ఉంది. నగర పోలీస్‌ కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి కొత్వాల్‌ హౌజ్‌లో జెండాను ఆవిష్కరించడం 2002 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ సీపీ సజ్జనర్ జెండా ఎగురవేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఈ వేడుకల్లో చార్మినార్ జోన్ డీసీపీ శ్రీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, అదనపు డీసీపీ మజీద్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు. 
*