శబరిమలైలో తప్పిపోయిన బాలుడిని కేరళ పోలీసుల సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించిన కర్నూలు పోలీసులు.

భారత్ న్యూస్ డిజిటల్:కర్నూలు;

శబరిమలైలో తప్పిపోయిన బాలుడిని కేరళ పోలీసుల సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించిన కర్నూలు పోలీసులు.
కర్నూలు నగరం దాల్ మిల్లు కు చెందిన బాలుడు నితిన్ (8) శబరిమలైలో తప్పిపోగా అక్కడున్న యాత్రికులు బాబు సమాచారం కర్నూలు 3 టౌన్ సి.ఐ. శేషయ్యకు అందించగా వెంటనే స్పందించి బాలుడి తండ్రి వెంకట రాముడుని బాలుడి వద్దకు చేర్చడంలో కీలకపాత్ర పోశించారు. తండ్రిని చూసిన బాలుడి ఆనందానికి కేరళ మరియు కర్నూలు పోలిసులు సమిష్టి గా కృషి చేసారు.