…భారత్ న్యూస్ హైదరాబాద్….వరంగల్‌లో నకిలీ కరెన్సీ స్కామ్
వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి. అక్కడి దుర్గశ్రీ వైన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు. ఈ డబ్బును బ్యాంక్‌లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా.. ఒక రూ.500, రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగనోట్ల చలామణితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
