భారత్ న్యూస్ అనంతపురం..చల్లపల్లి:
అతివేగం ప్రమాదకరమని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చల్లపల్లి పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ప్రమాదానికి గురైన కారును తీసుకువచ్చి 216 జాతీయ రహదారి పక్కన ఉంచారు. దానిపై ప్రమాదాలు జరిగిన వాహనాల ఫొటోలు ముద్రించి అంటించారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించేవారిని దీని ద్వారా అప్రమత్తం చేసి వారు సురక్షితంగా గమ్యం చేరాలనే ఉద్దేశ్యంతో ఇలా ఏర్పాటుచేసినట్లు చల్లపల్లి ఎస్ఐ డి.దుర్గాంజనేయులు తెలిపారు.
