భార్యను చంపిన రియల్టర్ …

ముక్కుపుడక ఆధారంతో ఓ హత్య కేసు చేధించారు ఢిల్లీ పోలీసులు. మార్చి 15వ తేదీన ఢిల్లీలోని ఓ కాలువలో సిమెంట్ బస్తాలో దుప్పటితో చుట్టేసిన ఓ మహిళ శవాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ శవం ముక్కుకు ఉన్న పుడక సాయంతో ఢిల్లీలోని అన్ని బంగారు షాపుల్లో విచారణ చేశారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అనీల్ కుమార్ ఆ ముక్కుపుడక కొన్నట్లు తెల్సుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత చనిపోయిన మహిళను 47 ఏళ్ల సీమాసింగ్ అని తేల్చారు. ఆమె అనీల్ భార్య. దీంతో అతన్ని సీమాసింగ్ ఎక్కడని ప్రశ్నించగా, ఆమె ద్వారక వెళ్లినట్లు చెప్పాడు అనీల్. తర్వాత సీమాసింగ్ డైరీ ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన పోలీసులు అసలు విషయం తెల్సుకున్నారు. సీమాసింగ్ సోదరి బబితతో మాట్లాడారు పోలీసులు. ఆమె గురించి ఆరా తీశారు. అయితే మార్చి 11వ తేదీ నుంచి తన అక్కతో మాట్లాడలేదనీ, అనీల్ మాత్రం సిమాసింగ్ జైపూర్ వెళ్లినట్లు చెప్పాడని బబిత తెలిపారు. దీంతో బబితితో పాటు సీమాసింగ్ పెద్ద కుమారుడిని ఢిల్లీకి పిలిపించిన పోలీసులు, శవాన్ని చూపించారు. వారు ఆ శవం తన తల్లిదేనని సీమాసింగ్ పెద్దకుమారుడు గుర్తించాడు. దీంతో అనీల్ కుమార్, అతని అసిస్టెంట్ శివశంకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.