భారత్ న్యూస్ విశాఖపట్నం..అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ డైరెక్టర్ మృతి
హాలీవుడ్ డైరెక్టర్ రాబ్ రీనర్ (78), ఆయన సతీమణి మిచెల్ సింగర్ లాస్ ఏంజెలెస్‌లోని తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి శరీరాలపై కత్తిగాయాలు కనిపించాయి. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబ్ రీనర్ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించారు. సపోర్టింగ్ యాక్టర్‌గా ఆయన నటనకు రెండు ఎమ్మీ అవార్డులు లభించాయి. ఆయన స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, వెన్ హారీ మెట్ సలీ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు….
