సింహాచలం దేవస్థానం ఇన్ ఛార్జ్ ఈవోగా సుజాత బాధ్యతలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…సింహాచలం దేవస్థానం ఇన్ ఛార్జ్ ఈవోగా సుజాత బాధ్యతలు

సింహాచలం :

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత ఆదివారం సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.
ఆమె మొదటిగా శ్రీ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి నక్కాని ఆనంద్ కుమార్ మరియు ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్య ఆమెకు సాదర స్వాగతం పలికారు.
ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తరువాత బేడా ప్రదక్షిణ చేయించారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు.