నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.

భారత్ న్యూస్ నెల్లూరు….నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది. వారం రోజుల పాటు అరుణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13, 14 తేదీల్లో ఆమెను విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు విచారించనున్నారు. అనంతరం 15న ఉదయం నెల్లూరు కేంద్ర కారాగారంలో అప్పగించాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో తెలిపింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు అనుమతినిచ్చింది. ఉద్యోగాలిప్పిస్తామని నగదు వసూలు చేసినందుకు సూర్యారావుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు.. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.