…వైఎస్ రాజారెడ్డి గారి 100 వ జయంతి

భారత్ న్యూస్ కడప ….Ammiraju Udaya Shankar.sharma News Editor…వైఎస్ రాజారెడ్డి గారి 100 వ జయంతి సందర్భంగా మా అబ్బకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నా. మా కుటుంబంలో ఆయనొక మహోన్నత వ్యక్తి. యెడుగూరి సందింటి వంశానికి శక్తి మరియు మూలస్థంభం. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజా నాయకుడిగా, రాజకీయాల్లోనే దిగ్గజంగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజారెడ్డి గారు.

అసమానమైన ధైర్య సాహసాలకు పెట్టింది పేరు రాజారెడ్డి గారు. దృఢమైన విలువలతో తన ప్రజలకు ఆపదలో అండగా నిలిచారు. నా కళ్ళతో నేను ఆయనను చూశా. ఓర్పు మరియు ధైర్యం రాజారెడ్డి గారి ఆయుధాలు. ప్రజల సమస్యలను వినడం, వాటిని పరిష్కరించడంలో నిక్కచ్చిగా నిలవడమే ఆయన తత్వం. రాజారెడ్డి గారు ప్రజా నాయకుడు. ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆసుపత్రి కట్టించారు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలని డిగ్రీ కాలేజీ, మహిళా కళాశాల, పాల్ టెక్నిక్ కాలేజీ లాంటి విద్యాసంస్థలు కట్టించారు. ప్రజల మనిషిగా, ప్రజల గుండెలో శాశ్వత స్థానం సంపాదించే ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

ఆయన ధైర్యం, క్రమశిక్షణ, న్యాయం పట్ల నిబద్ధత లాంటి అంశాలు ప్రజా సేవలో మా భవిష్యత్ ను కూడా తీర్చిదిద్దాయి. రాజారెడ్డి గారు చేసిన సేవ, అంకితభావం తరతరాలకు స్పూర్తి ప్రదాయకంగా నిలుస్తుందని గర్వంగా చెప్తున్న.