భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…సింహాచలం ఆలయంలో గోడ కూలి మరణించిన ఇద్దరికి 4 లక్షల రూపాయలు అందజేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు
ఇటీవల సింహాచలం దేవస్థానంలో గోడ కూలి 8 మంది మరణించిన విషయం తెలిసిందే కాగా ఆ మరణించిన వారిలో ఇద్దరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలానికి చెందినవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరణించిన వారికి 25 లక్షల ప్రకటించగా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరణించిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు..ఒకవేళ వాళ్ళు ఇవ్వని పక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన 75 లక్షలు వారికి అందజేస్తానని చెప్పారు దానిలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరణించిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున 4 లక్షలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు గారు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి గారు, మాజీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీ కే రావు గారు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
