భారత్ న్యూస్ విజయవాడ…ఎన్టీఆర్ జిల్లా మైలవరం:
బ్రేకింగ్ న్యూస్:
మైలవరం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు:
మైలవరం మండలం చంద్రాల గ్రామంలో 2017 -18 సంవత్సరంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందలేదని స్థానిక తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు బాధితులు…..
రోడ్డు నిర్మాణం జరిగి 8 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన మాకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…..
తమకు న్యాయం చేయాలని అనేకమార్లు రోడ్డెక్కిన వినతి పత్రాలు మీద వినతి పత్రాలు సమర్పించిన… ప్రయోజనం మాత్రం శూన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలుగజేసుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని బాధితుల డిమాండ్ చేస్తున్నారు….
బాధితులకు మద్దతుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాట్ల సుధాకర్.. పగడాల ఆంజనేయులు (సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు) మరియు పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు…..
