కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా

భారత్ న్యూస్ శ్రీకాకుళం..చిత్తూరు జిల్లా ,కుప్పం మండలం, నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషను సిఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సిఎం అన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని….ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.