ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

భారత్ న్యూస్ రాజమండ్రి….ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు ఆగిపోవడంతో ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బస్సులో నుంచి పొగలు ప్రారంభమై మంటలు అంటుకున్నాయి.

అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికుల్ని వెంటనే కిందకి దింపడంతో ప్రమాదం తప్పింది.

సెల్ఫ్ మోటర్‌కి బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారూ

కాగా ప్రయాణికుల లగేజ్, పలు వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది.