అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంత్యంత పటిష్టంగా ఉన్నదని,

భారత్ న్యూస్ గుంటూరు….అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంత్యంత పటిష్టంగా ఉన్నదని అవనిగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావులు అన్నారు.. మోపిదేవిలో గడచిన రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగియగా అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి మండల పార్టీల నియామకానికి కసరత్తు ముగిసిందని, మండలాల వారీగా ఒక్కొక్కరిని పిలిచి అభిప్రాయాలు సేకరించామని రామరాజు, కనపర్తి శ్రీనివాసరావులు తెలిపారు.. పార్టీ గ్రామ, క్లస్టర్ కమిటీల నుంచి సేకరించిన అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకు వెళతామని రాబోయే కొద్ది రోజుల్లో పార్టీ మండల కమిటీలను ప్రకటిస్తుందని తెలిపారు.. నియోజకవర్గంలో పార్టీ అంత్యంత పటిష్టంగా ఉందని, గ్రామ మండల కమిటీల ప్రక్రియ పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించామని తెలిపారు.. ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా మంతెన రామరాజు, కనపర్తి శ్రీనివాసరావులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు..