భారత్ న్యూస్ విజయవాడ…శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….
• 1926 నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమిలో ఒకలక్ష్యం కోసం అవతరించారు.
• ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవనప్రయాణాన్ని సాగించి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు
• సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు.
• 8 ఏళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు.
• 1940 మే 23న సత్యసాయి వయసు 14 ఏళ్లు…అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు.
• దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు.
• శ్రీ సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు.
• చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు.
• మావన రూపంలో
మనం చూసిన దైవమే సత్యసాయి బాబా
• బాబా శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం.
• లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్..హెల్ప్ ఎవర్, హర్ట నెవర్ అని సత్యసాయి బోధించారు.
• సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారు
• 1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది.
• విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు.
• భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు.
• ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో అందుకున్నారు.
• ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్.
• శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది.
• ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు.
• ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది.
• మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా… సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరించారు.
• విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు.
• దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు.
• 102 సత్యాసాయి పాఠశాలల్లో 60 వేలమంది విద్యార్థులు చదవుకుంటున్నారు.. వారికి ఉచిత విద్య అందిస్తున్నారు.
• ట్రస్ట్ ఆస్పత్రుల ద్వారా 3 వేల మందికి ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తున్నారు.
• దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 16 వందల గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా నీరు అందిస్తున్నారు.
• చెన్నై డ్రికింగ్ మోడరేజేషన్‌కు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు.
• సత్యసాయి ట్రస్ట్ 140 దేశాలు, 2 వేల కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషన్ ఆర్గనేజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తోంది.
• చాలా గర్వపడుతున్నా… సత్యసాయికి ఈ రోజు 7.50 క్షల మంది సేవా సభ్యులు ఉన్నారు.
• ఆయన సేవలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.
• తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా.
• సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాబా ఇక్కడికి రప్పించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా.
• వసుధైక కుటుంబం భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందాం.
