భారత్ న్యూస్ శ్రీకాకుళం…..రోహిణి కార్తె ప్రారంభం.. రోళ్లు పగిలే ఎండల్లేవు!
ఈ సారి వేసవికాలం వర్షాకాలంలా మారింది.
క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలకు పరిస్థితులే మారిపోయాయి. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు (బండలు) పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది.
మరోవైపు కాలం ముందే వచ్చేసిందని, ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేస్తాయేమోనని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
