భారత్ న్యూస్ గుంటూరు…..దివిసీమలో ఘనంగా వంగవీటి రంగా జయంతోత్సవాలు..!
అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమలో పలు చోట్ల వంగవీటి మోహన రంగా 78 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డలో శ్రీ రాధా రంగా మిత్రమండలి దివి యూనిట్ అధ్యక్షులు యాసం చిట్టిబాబు నేతృత్వంలో రంగా జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన రక్తదాన శిబిరంలో 50 మంది రంగా అభిమానులు రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ…
వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక శక్తి అని, రంగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా సేవా భావాన్ని యువత అందిపుచ్చుకోవాలని రంగా అభిమానులకు సూచించారు.
ఈకార్యక్రమంలో డిసి చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, మత్తి వెంకటేశ్వరరావు, మర్రే గంగయ్య, పూతబోయిన కరుణకుమార్ ,సీతారత్న సాయిబాబు, నాయకులు,రంగా అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
