ప్రజా దర్బార్ నిర్వహణ పేరుతో చెట్లు నరికివేత

భారత్ న్యూస్ గుంటూరు….అవనిగడ్డ నియోజకవర్గం:
మోపిదేవి:

ప్రజా దర్బార్ నిర్వహణ పేరుతో చెట్లు నరికివేత

నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు నరికివేత

ఇటీవల చల్లపల్లిలో చెట్లను నరికారనే పేరుతో చల్లపల్లి గ్రామస్థులపై కేసులు, చెట్లను నరికటం పై అప్పుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఎంమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

20వ తేదీ మంగళవారం మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధ ప్రసాద్ మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు, మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో
ఎన్నో సంవత్సరాలుగా నీడనిస్తున్న వేప చెట్లను రాత్రికి రాత్రే నరికివేస్తూన్నారు…,

ఎమ్మెల్యే మేప్పు కోసమో… మరి దేనికోసమో ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న అధికారి చెట్ల కొమ్మలను నరికి వేయాలంటూ ఇచ్చిన ఆదేశాలతో రాత్రి సమయంలో నరికివేత..,

రాబోయే వేసవికాలం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు నీడనిస్తున్న వేప చెట్లను నరికి వేస్తూ ఉండటంపై గ్రామస్తులు అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…,

రాష్ట్ర ప్రభుత్వ చెట్లను పెంచండి అని చెబుతుండగా పెరిగిన వేప చెట్లను సభలంటూ నరికి వేయటo పై వైసీపీ నేత గౌతమ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు.